వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇళ్ల గణన: కిషన్ రెడ్డి - కిషన్రెడ్డి మీడియా సమావేశం
జనగణనకు ముందు దేశంలో ఇళ్ల పరిస్థితులపై సమాచార సేకరణ జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో గృహాల గణన ప్రక్రియ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇళ్ల గణన: కిషన్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా జనాభా ప్రాతిపదిక ఇళ్ల గణన చేపడతామని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మొదటి విడతలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆరు లక్షల, 40వేల 932 గ్రామాల్లో... గృహాల సమాచార సేకరణ, జనగణన సమాంతరంగా జరుగుతాయని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 24కోట్ల ఇళ్లు ఉన్నట్లు తేల్చారు. గతంలో 18 భాషల్లో జనగణన చేపట్టినట్లు వివరించారు. ఈసారి మొబైల్ యాప్ ద్వారా సెన్సస్ పోర్టల్ రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.