హైదరాబాద్‌లోని బర్కత్‌పుర భాజపా కార్యాలయంలో కరోనా బాధిత కుటుంబాలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహారం పంపిణీ చేశారు. మే, జూన్‌లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం బియ్యం పంపిణీ చేస్తున్నామని... ప్రజల అవసరాల మేరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి
వారం రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరగడం లేదని.. రాజకీయ పట్టింపులకు పోకుండా టీకా రెండో డోసు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పీఎంకేర్ నిధులతో రాష్ట్రానికి వెంటిలేటర్లు పంపించామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి
కరోనా విషయంలో రాజకీయం చేయకుండా రెండో డోసును వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పీఎంకేర్ నిధులతో రాష్ట్రానికి వెంటిలేటర్లు పంపించామని వెల్లడించారు. 46 ఆస్పత్రులకు 1,405 వెంటిలేటర్లు పంపించామన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.