కరోనాతో దెబ్బతిన్న వీధి వ్యాపారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా మనమంతా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీధి వ్యాపారులైతే మరింత ఇబ్బందులకు గురయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
వీధి వ్యాపారుల్లో ఆత్మస్థైర్యం నింపుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి - వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక పథకం
కరోనాతో దెబ్బతిన్న వీధి వ్యాపారుల్లో ఆత్మస్థైర్యం నింపుతామని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వీరి కోసం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

'వీధి వ్యాపారుల్లో ఆత్మస్థైర్యం నింపుతాం'
వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలో భాగంగాలేని చిరు వ్యాపారులకు సహాయం కోసం ఉద్దేశించిన ఈ పథకం ఒక గొప్ప ప్రయత్నమని, పీఎం స్వనిధి పథకం కింద ఒక వీధి వ్యాపారి 2022 మార్చి వరకు రూ. 10,000 వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా.. సులభంగా తన వ్యాపారం కోసం మూలధన రుణాన్ని పొందవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రుణం కాలపరిమితి సంవత్సరం కాగా.. ఒకవేళ ముందస్తుగా తిరిగి చెల్లించినా ఎటువంటి జరిమానా ఉండదని స్పష్టం చేశారు.