తెలంగాణ

telangana

ETV Bharat / state

పాకిస్థాన్​ కవ్వింపు చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధం: కిషన్​రెడ్డి

కరోనా నుంచి కోలుకుంటున్న భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించిందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో అన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమేనని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

central-minister-kishan-reddy-on-pakisthan
పాకిస్థాన్​ కవ్వింపు చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధం: కిషన్​రెడ్డి

By

Published : Nov 14, 2020, 10:21 PM IST

వోకల్ టూ లోకల్... లోకల్ టూ గ్లోబల్ నినాదంతో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తిరుపతిలోని ఖాదీవస్త్ర విక్రయ దుకాణాన్ని పరిశీలించారు. దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో స్థానిక పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి అన్నారు.

పాకిస్థాన్ కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధంగా ఉందన్నారు. పాకిస్థాన్​లో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంతో పాటు భారతదేశంలోకి పంపుతూ.. వారికి అండగా నిలుస్తుందని మంత్రి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:అసలే కరోనా టైం.. టపాసులెందుకు దీపాలు చాలు!

ABOUT THE AUTHOR

...view details