హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవలు వచ్చే వారంలో పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఎంఎంటీఎస్ రైళ్ల పునఃప్రారంభంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయాలు కలుగుతాయని కిషన్ రెడ్డి.. ఓ ప్రకటనలో వివరించారు. కొవిడ్ నిబంధనలతో రైళ్లు నడుస్తాయని చెప్పారు.
MMTS: వచ్చే వారంలో పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు: కిషన్ రెడ్డి - mmts restart in hyderabad
కరోనా కారణంగా హైదరాబాద్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా ఉద్ధృతితో ఏడాదిన్నరపాటు పట్టాలెక్కని ఎంఎంటీస్ రైళ్లు వచ్చే వారంలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

వచ్చే వారంలో ఎంఎంటీఎస్ రైళ్లు
ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎంఎంటీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కి నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.