దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా తెరాసకు కనువిప్పు కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందువల్లనే నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ప్రకటన చేశారని.. ఇది సంతోషించదగిన విషయమన్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల బరిలో రహమత్నగర్ డివిజన్లో భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారిని కిషన్ రెడ్డి పరామర్శించారు. ఓడిపోయిన భాజపా అభ్యర్థులకు భరోసా ఇస్తూ... రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని కిషన్రెడ్డి వెల్లడించారు.
ప్రజా తీర్పుతో తెరాసకు కనువిప్పు కలిగింది: కిషన్రెడ్డి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి... ఓడిపోయిన అభ్యర్థులకు భరోసా ఇస్తూ.. పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులపై కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో గణాంకాల వల్ల తెరాసకు కనువిప్పు కలిగింది: కిషన్రెడ్డి