తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ - Corona cases increase in state

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ సూచనలను కట్టుదిట్టంగా అమలుచేయడంపై సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజల్లో ధైర్యం నింపాలని సూచించారు. రాష్ర్టంలో నమూనా పరీక్షలు అధికం చేస్తూ... పరిక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ...
కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ...

By

Published : Jun 9, 2020, 7:19 PM IST

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళనవ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ సూచనలను కట్టుదిట్టంగా అమలుచేయడంపై సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను దూరం చేయాల్సిన భాధ్యత అందరిపైనా ఉందని లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీసూదన్‌ దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లా కల్లెక్టర్లు, అధికారులతో వీడియో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ ఎంసీ కమిషనర్​తో సహా పలువురు అధికారులతో చర్చించి పలు సలహాలు, సూచనలు చేసినట్టు తెలిపారు.

ప్రజల్లో ధైర్యం నింపండి…

వైద్య రంగంలో అనుభవం వున్న సీనియర్ అధికారులను ప్రముఖ ఆసుపత్రుల్లో మొహరించాలన్నారు. కరోనా నేపథ్యంలో వారియర్స్ గా పనిచేస్తున్న సిబ్బంది రక్షణకు తగు చర్యలు తీసుకుంటూ... వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించాలని తెలిపారు.

పరీక్షలు ఎక్కువగా చేయండి….

జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి సకాలంలో రోగులను గుర్తించి, సత్వరం అందరికీ పరీక్షలు చేసి, బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. ఓవైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇతరత్ర అత్యవసర వైద్యసేవలు అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

కంటైన్మెంట్ జోన్లలో నమూనా పరీక్షలు అధికం చేస్తూ... పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజల్లో ధైర్యం నింపాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details