దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో ఏ ఒక్కరికైనా పౌరసత్వ సవరణ బిల్లు వల్ల నష్టం జరిగితే ... బిల్లును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్థిక నిపుణుడు అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం అనే పుస్తకాన్ని హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ హోటల్లో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. వర్తమాన రాజకీయలు, ఆర్థిక విశ్లేషణలు ఈ పుస్తకంలో రచయిత రాకేష్ రెడ్డి చక్కగా వివరించారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాజపా నాయకుడు పెద్ది రెడ్డిలు పాల్గొన్నారు.
సీఏఏతో ఒక్కరికి నష్టం జరిగినా... ఉపసంహరించుకుంటాం' - అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం
ఆర్థిక నిపుణుడు అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం అనే పుస్తకాన్ని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
దేశంలో కుహనా మేధావులు ఎక్కువైపోయారని కిషన్ రెడ్డి తెలిపారు. సీఏఏ బిల్లుపై అవగాహన లేకుండా మాట్లాడుతూ... ఒక మతానికి, వర్గానికి నష్టం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇస్లామిక్ దేశాలలో ప్రభుత్వం, సమాజం నుంచి ఏ గుర్తింపు లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్న బౌద్ధులు, సిక్కులు, హిందువులు భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. వారిని ఆదుకునేందుకే ఈ బిల్లును తెచ్చినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి'