తెలంగాణ

telangana

ETV Bharat / state

Union Minister Kishan reddy: 'రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం' - షేక్​పేట్​ పైవంతెన ప్రారంభోత్సవంలో కిషన్​ రెడ్డి

Union Minister Kishan reddy: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కిషన్​ రెడ్డి సూచించారు. నగరంలో స్కైవేల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. రీజినల్​ రింగ్​రోడ్డుకు సంబంధించి త్వరగా భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నగరంలో నిర్మించిన షేక్​పేట్​ ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్​తో కలిసి కిషన్​ రెడ్డి ప్రారంభించారు.

Union Minister Kishan reddy, shaikpet flyover
షేక్​పేట్​ ఫ్లై ఓవర్​, కిషన్​ రెడ్డి

By

Published : Jan 1, 2022, 2:08 PM IST

Updated : Jan 1, 2022, 2:50 PM IST

Shaikpet flyover opening: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని.. ఏడున్నరేళ్లలో భారీగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం కానుందని.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం- ఎస్​ఆర్​డీపీ కింద ప్రభుత్వం చేపట్టిన అత్యంత పొడవైన షేక్​పేట్​ ఫ్లైఓవర్​ను.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

అభివాదం చేసుకుంటున్న కిషన్​ రెడ్డి, కేటీఆర్​
పైవంతెన ప్రణాళికను పరిశీలిస్తున్న కిషన్​ రెడ్డి, కేటీఆర్​

'హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. రీజినల్​ రింగ్​రోడ్డును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టాలి. ఆర్​ఆర్​ఆర్​ పూర్తయితే తెలంగాణ ప్రగతికి దోహదపడుతుంది.'

-కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

ఆ నిధులు వినియోగించాలి

రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం : కిషన్‌రెడ్డి

Union Minister Kishan reddy: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొన్ని జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయని... మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో స్కైవేల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. స్వదేశీ దర్శన్‌ కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని కిషన్‌ రెడ్డి కోరారు.

ఇదీ చదవండి:Shaikpet Flyover Opening: కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: కేటీఆర్

Last Updated : Jan 1, 2022, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details