Kishanreddy fires on KCR: ప్రధాని నరేంద్రమోదీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో భాజపా నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న స్వాగత సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రామగుండం యూరియా పరిశ్రమ ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడి నుంచే జాతీయ రహదారులు, రైల్వే పనులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను వదిలే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా గవర్నర్ను తెరాస సర్కార్ పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ.. స్వయంగా పెట్రోలియం శాఖామంత్రి సీఎం కేసీఆర్కు లేఖ రాశారన్నారు.