Kishanreddy Fires on KTR : ఐటీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన.. సీఎం కేసీఆర్ రాజీనామా తీసుకొస్తే కేటీఆర్‌తో చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు.
తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదు: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకొని కేటీఆర్ వస్తే తాను చర్చకు సిద్ధమని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే దిగజారి కేటీఆర్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేటీఆర్ స్టేట్మెంట్స్ తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. కుర్కురే పంపిణీపై కేటీఆర్ మాట్లాడటం అనాథ చిన్నారులను అవమానించడమేనని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు. మమ్మల్ని తిట్టండి కానీ దేశ ప్రతిష్టను మాత్రం దిగజార్చవద్దని కిషన్‌రెడ్డి హితవు పలికారు.