ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు కొంటాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - kishan reddy statements

kishan reddy on paddy procurement: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం తెరాస ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసిందా? అని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజ వరకు కొంటామని స్పష్టం చేశారు.

kishan reddy
kishan reddy
author img

By

Published : Mar 25, 2022, 3:16 PM IST

Updated : Mar 25, 2022, 4:47 PM IST

kishan reddy on paddy procurement: ధాన్యం విషయంలో రాజకీయ లబ్ధి కోసం తెరాస ప్రజలను రెచ్చగొట్టొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఆంధ్ర, తమిళనాడులో లేని సమస్యలు తెలంగాణకే ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసిందా? అని ప్రశ్నించారు. పెట్రోల్‌పై అనేక రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించినా.. తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌కు అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశామని వివరించారు.

"ధాన్యం ఎక్కడైనా ప్రధాని, సీఎం డబ్బులతో కొంటారా? ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసిందా? రాష్ట్ర మంత్రులు కేంద్రంపై, మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పెట్రోల్‌పై అనేక రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాయి.. తెరాస ప్రభుత్వం తగ్గించిందా?. ఉక్రెయిన్‌-రష్యా యుద్దం వల్ల రూ.20 వేల కోట్లు నష్టం వచ్చింది. హైదరాబాద్‌కు అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశాం. ఏదైనా సాంకేతిక లోపాలతో కేంద్రం నుంచి రాకపోతే అభాండాలు వేస్తున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల్లో బియ్యం మాత్రమే కొంటుంది. ఆంధ్ర, తమిళనాడులో లేని సమస్యలు మీకే ఎందుకు వస్తున్నాయి.?"

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

చివరి గింజ వరకు కొంటాం:సన్నరకం ధాన్యం సాగు చేయమని ప్రోత్సహించింది మీరు కాదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ముడి బియ్యం చివరి గింజ వరకు కేంద్రం కొంటుందని హామీనిచ్చారు. సీఎం కేసీఆర్‌ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014-15లో ధాన్యం కొనుగోలుకు రూ.3,404 కోట్లు ఖర్చు చేస్తే.. గతేడాది ధాన్యం కొనుగోలుకు రూ.26వేల 441 కోట్లు ఒక్క తెలంగాణకే కేంద్రం వ్యయం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇంతవరకు ధాన్యం ఎంతసాగైందో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని ఆరోపించారు.

"హుజురాబాద్‌ ఎన్నిక తర్వాత సీఎంలో విచిత్ర మార్పు వచ్చింది. హుజురాబాద్‌ ఓటమితో కుంగిపోయి భాజపాను అప్రతిష్ఠ పాల్జేసే కుట్ర చేస్తున్నారు. మీరెన్ని కుట్రలు చేసినా, తిట్టినా.. ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది. ఎందుకు సేకరణ విధానాన్ని మార్చాలనుకుంటున్నారో చెప్పాలి. "

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ధాన్యంకొనుగోలుపై కిషన్‌రెడ్డి ప్రసంగం

ఇదీ చదవండి :'రాష్ట్రంపై చాలా విషయాల్లో కేంద్రం అన్యాయం చేస్తోంది..

Last Updated : Mar 25, 2022, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details