సమాజానికి అంకిత భావంతో సేవలందించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు, కార్యకర్తలకు భాజపా (Bjp)... సరైన గుర్తింపు ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ భర్త దివంగత ప్రకాశ్ గౌడ్ జయంతి.. లాక్డౌన్ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి కిషన్‌రెడ్డి (Kishan Reddy), లక్ష్మణ్ ఆహారం పంపిణీ చేశారు.
Kishan Reddy: భాజపాలో వారికి సరైన గుర్తింపు ఉంటుంది - కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తాజా వార్తలు
హైదరాబాద్ అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ భర్త ప్రకాశ్‌గౌడ్ జయంతి, లాక్డౌన్ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆహారాన్ని పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy). ప్రకాశ్ గౌడ్ మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
![Kishan Reddy: భాజపాలో వారికి సరైన గుర్తింపు ఉంటుంది Central minister kishan reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12154984-638-12154984-1623844558082.jpg)
భాజపా
ప్రకాశ్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉండేవారని కిషన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పార్టీకి ఆ కుటుంబానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కర్తవ్యంగా విధులు నిర్వహించిన ప్రకాశ్ గౌడ్ సేవలు చిరస్మరణీయమని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
ఇదీ చూడండి: ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..
Last Updated : Jun 16, 2021, 9:30 PM IST