తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర నిధులు కేటాయిస్తున్నా అసత్యాలు చెబుతున్నారు' - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​లో వరదలకు తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. కేసీఆర్​, కేటీఆర్​ అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు.

central minister kishan reddy comments trs government
'కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అసత్యాలు చెబుతున్నారు'

By

Published : Nov 8, 2020, 7:09 PM IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నా.. కేసీఆర్​, కేటీఆర్​ అసత్యాలు చెబుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రహదారుల మరమ్మతుల కోసం 202 కోట్లు, వరదసాయం కోసం డిజాస్టర్‌ ఫండ్‌ కింద 224 కోట్లు ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు పలువురు భాజపాలో చేరారు. హైదరాబాద్‌లో వరదలకు తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఏడేళ్లు గడుస్తున్నా పేద ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించలేదని దుయ్యబట్టారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు తెరాస కోల్పోయిందని విమర్శించారు.

'కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా అసత్యాలు చెబుతున్నారు'


ఇవీ చూడండి: వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details