Kishan Reddy on Paddy Procurement: హుజూరాబాద్‌లో ఓటమి తర్వాతే సీఎం కేసీఆర్ బియ్యం అంశం లేవనెత్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి 27.39 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్‌సీఐకి 27.39 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్రం సరఫరా చేయాలన్నారు. ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని స్పష్టం చేశారు. మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'ఒప్పందం ప్రకారం రా రైస్ ఎంత వస్తే అంత కొంటామని గోయల్ చెప్పారు. 2022 సీజను ధాన్యం సేకరణ ప్రారంభంకాబోతోంది. జనవరి నుంచి జులై 31 వరకు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఒప్పందం ఉంది. ప్రతి గింజా కొంటామని సీఎం కేసీఆర్ చెప్పలేదా? రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?