జాతీయ పౌరపట్టిక, ఎన్ఆర్సీ, సీఏఏ, జీఎస్టీల మధ్య తేడా కూడా రాహుల్ గాంధీకి తెలియదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్పీఆర్ దేశానికి ఏవిధంగా నష్టమో, భారతీయులను విదేశాలకు ఎలా పంపిస్తుందో రాహుల్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దేశంలోకి ఇష్టం వచ్చినట్లు ఎవరైనా రావచ్చనకున్నప్పుడు... దేశానికి సరిహద్దులు, భద్రతా దళాలు ఎందుకున్నారని ప్రశ్నించారు.
ఎన్పీఆర్కు ధ్రువపత్రాలు అవసరం లేదు
జాతీయ పౌరపట్టికకు, జనాభా లెక్కల సేకరణకు పెద్ద తేడా ఉండదని, ఆ రెండింటినీ వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్పీఆర్ కోసం డాక్యుమెంట్లు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలకు ఎన్పీఆర్ వివరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్పీఆర్కు, ఎన్సీఆర్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.