తెలంగాణ

telangana

ETV Bharat / state

' సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్' - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు సున్నా అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సవాల్​ విసిరారు.

central minister kishan reddy challenges telangana chief minister kcr
'కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్'

By

Published : Jan 18, 2020, 6:59 PM IST

కేసీఆర్​ అవినీతి పాలనలో తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే... ప్రజలు భాజపాకు పట్టం కట్టాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​లో కేంద్ర మంత్రి ప్రచారం నిర్వహించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు శూన్యమంటున్న సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ హయాంలో రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి... మోదీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో చెప్పడానికి సిద్ధమని... కేటీఆర్​ రెడీయేనా అని కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు.

'కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్'

ABOUT THE AUTHOR

...view details