కులమతాలకు అతీతంగా పేద ధనికులకు సమానంగా అవతరించిన పార్టీ... భారతీయ జనతా పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భాజపా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని రాజీవ్‌నగర్ చౌరస్తాలో భాజపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు.
కులమతాలకు అతీతంగా అవతరించిన పార్టీ భాజపానే: కిషన్ రెడ్డి - భారతీయ జనతా పార్టీ
బడుగు బలహీన వర్గాలకు భాజపా పార్టీ పెద్దపీట వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భాజపా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డలోని సీనియర్ నేతతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు.
కులమతాలకు అతీతంగా అవతరించిన పార్టీ భాజపానే: కిషన్ రెడ్డి
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని... అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగి ఉన్న పార్టీ తమదేనని కిషన్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు భాజపా పార్టీ పెద్ద పీట వేసిందని... రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత భాజపాకే దక్కుతుందని వెల్లడించారు. నిత్యం పేద ప్రజల కొరకు, దేశం కోసం పనిచేసే పార్టీ తమదేనని కిషన్ తెలిపారు.