కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన... కొవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా మహమ్మారిపై విజయం సాధించలేమని... అందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు.
'టీకా ఉత్సవ్'పై అవగాహన తీసుకురావాలి: కిషన్ రెడ్డి
కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలోని సౌకర్యాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు టీకా తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
ప్రభుత్వ సూచనల మేరకు వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవాలని తెలిపారు. టీకా వేయించుకున్న వారు నిర్లక్ష్యం వహించవద్దన్న కిషన్‌రెడ్డి... టీకా ఉత్సవ్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని... ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో వైరస్ నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? దేశంలో హార్డ్ ఇమ్యునిటీని గుర్తించేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుందా అనే వివరాలపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:ఈనెల నుంచే ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం: మంత్రులు