రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో.. మణిపూర్ యువకులను విదేశీయులుగా భావించి సూపర్ మార్కెట్లోనికి అనుమతించని వ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజూ స్పందించారు. సదరు దుకాణ యజమానిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులను కేంద్ర మంత్రి అభినందించారు.
వనస్థలిపురంలో ఇద్దరు మణిపూర్ యువకులను సూపర్‌మార్కెట్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఆ విషయాన్ని బాధితులు రాచకొండ పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు.. సూపర్‌మార్కెట్ సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.