తెలంగాణ

telangana

ETV Bharat / state

Jyotiraditya Scindia: వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్‌ విమానాశ్రయాలు! - జ్యోతిరాదిత్య సింధియా తాజా వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే తెలంగాణ సీఎం కేసీఆర్‌(cm kcr)తో ఉన్నాయని.. తెరాసతో భాజపా రాజకీయ పోరాటం కొనసాగుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. విమానయానరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న ఆయన.. రాష్ట్రంలో నూతన విమానశ్రయాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని చెప్పారు.

central-minister-jyotiraditya-scindia-press-meet-after-medicine-from-the-sky-project
central-minister-jyotiraditya-scindia-press-meet-after-medicine-from-the-sky-project

By

Published : Sep 11, 2021, 5:40 PM IST

Updated : Sep 11, 2021, 7:16 PM IST

డ్రోన్ల(drones) ద్వారా ఔషధాల సరఫరా ఒక గొప్ప మార్పు తెస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ(Union Minister for Civil Aviation) మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) ధీమా వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన అన్నారు. డిజిటల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యాప్‌ ద్వారా అనుమతులు సులభతరం చేశామని చెప్పారు. వికారాబాద్(Vikarabad)​లో "మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(medicine from the sky)" ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎయిర్‌ స్పేస్‌(Air space)ను మూడు భాగాలుగా విభజించి అనుమతులు ఇస్తున్నామని సింధియా అన్నారు. తద్వారా డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశామని వెల్లడించారు. విమానాశ్రయం విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు.. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్‌ విమానాశ్రయాల(brown field airports) నిర్మాణానికి సుముఖంగా ఉన్నామని వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr)తో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను అమలు చేయటం కేంద్రమంత్రులుగా తమ బాధ్యత. తెరాసతో భాజపా రాజకీయ పోరాటం కొనసాగుతుంది. ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ విమానాశ్రయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాను. వరంగల్‌, ఆదిలాబాద్​లో బ్రౌన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సుముఖంగా ఉన్నాం. -జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒక సీటు మాత్రమే గెలుచుకుందని చెప్పిన ఆయన.. పార్లమెంటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఓటర్లు భాజపాను ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో భాజపాపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడించారు.

ఇదీ చదవండి:Jyotiraditya Scindia : డ్రోన్ టెక్నాలజీ చరిత్రలోనే ఓ సంచలనం: కేంద్ర మంత్రి సింధియా

Last Updated : Sep 11, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details