ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ఆర్థికశాఖ 2013-14 నాటి ధరలకే పరిమితం చేసిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. సవరించిన అంచనాల కమిటీ సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో నరసాపురం ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
2013 - 14 లెక్కల ప్రకారమే పోలవరం వ్యయం: కేంద్రం - telangana news
2013 - 14 నాటి ధరలకే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని పరిమితం చేసినట్లు... కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు.. ఈ విధంగా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
‘ఏపీ విభజన చట్టం రూపొందించే సమయంలో ఈ ప్రాజెక్టును మేమే చేపడతామని భారత ప్రభుత్వం చెప్పింది. కేబినెట్ నోట్‌లో 2013-14 నాటి ధరల ప్రకారం అయ్యే ఖర్చును కేంద్రం సమకూరుస్తుందని చెప్పారు. నిర్మాణంలో జాప్యం జరిగింది. దానివల్ల, కొత్త ఆర్ అండ్ ఆర్ అంశాల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. దీనిపై సవరించిన అంచనాల కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వశాఖ 2013-14 నాటి ధరల స్థాయికే పరిమితి (క్యాప్) విధించింది. నేను ఒకటి చెప్పదలచుకున్నాను. కేంద్రం రాబోయే రోజుల్లో సరైన సమయంలో, సరైన స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేపడుతుంది’ అని గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్