తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడుపై​ కేంద్ర మంత్రి స్పందన - తెలంగాణ తాజా వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాసిన లేఖపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవో వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తూ బండి సంజయ్​ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే విచారణ జరుపుతామని తెలిపారు.

central minister gajendra singh sekavath react
బండి సంజయ్​ లేఖపై కేంద్ర మంత్రి స్పందన

By

Published : May 13, 2020, 7:55 PM IST

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ రాసిన లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ స్పందించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రికి... బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు.

దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంటనే విచారణ జరుపుతామని తెలిపారు. రెండు రోజుల్లో వాస్తవాలు తెలపాలని కృష్ణానదీ మేనేజ్​మెంట్​ బోర్డును ఆదేశించారు.

ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ABOUT THE AUTHOR

...view details