తెలంగాణ

telangana

ETV Bharat / state

2020 అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే బోర్డులపై నోటిఫికేషన్‌ : కేంద్ర జల్‌శక్తి శాఖ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుందని తెలిపారు.

central jalashakthi
కేంద్ర జల్‌శక్తి శాఖ

By

Published : Jul 16, 2021, 3:17 PM IST

Updated : Jul 16, 2021, 7:39 PM IST

ట్రైబ్యునల్‌ నిర్ణయం మేరకే నీటి కేటాయింపులు : కేంద్ర జల్‌శక్తి శాఖ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర జల్​శక్తి శాఖ నిన్న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను ఈరోజు జల్‌శక్తి అధికారులు వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని, అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి, ఇరురాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 2016 సెప్టెంబర్‌లో తొలిసారి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమైందని. నాటి భేటీలో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని వెల్లడించారు.

ఎంతో చర్చించాం

2020 అక్టోబర్‌ 6న కమిటీ మళ్లీ సమావేశమైందని తెలిపారు. 2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామని, అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామనన్నారు. గతరాత్రి ఇచ్చిన గెజిట్ నోటికేషన్‌ ముందు ఎంతో చర్చించామని, సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశామని, ఏపీ పునర్ విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఉద్ఘాటించారు.

రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి

బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాలని చెప్పారు. నోటిఫికేషన్‌ వచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని తెలిపారు. బోర్డుల నిర్వహణకు నిధులు, వనరుల కొరత రాకూడదన్నారు. ఏది ఆమోదం పొందిన ప్రాజెక్టో... ఏది ఆమోదం పొందలేదో నిర్వచించామని పేర్కొన్నారు. బి-పార్ట్ షెడ్యూల్‌లో ఉన్నంత మాత్రాన ఆమోదం పొందినట్లు భావించొద్దని చెప్పారు. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్-2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుందన్నారు. షెడ్యూల్-3లో ఇప్పుడు ఉన్నట్లే రాష్ట్రాల పర్యవేక్షణ కొనసాగుతోందని, గోదావరి, కృష్ణా బోర్డుల సూచన మేరకే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

'ఏపీ, తెలంగాణ అవసరాలు, ప్రతిపాదనలు మేరకు నీటి విడుదల ఉంటుంది. ఇరురాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ అంశం చాలా సున్నితమైంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం తరలింపు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఇరురాష్ట్రాల మధ్య సయోధ్య, ఏకాభిప్రాయం తేవడమే అతిపెద్ద సవాలు. ట్రైబ్యునళ్ల పంపిణీ ప్రకారమే నీటి కేటాయింపులు ఉంటాయి. ఉమ్మడి ఏపీకి ఇప్పటికే నిర్దిష్టమైన కేటాయింపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేటాయింపులకు అనుగుణంగా ఇరురాష్ట్రాలకు పంపిణీ ఉంటుంది.'

-సంజయ్ అవస్థి​, జల్​శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి

ఇదీ చదవండి:Revanth Arrest: 'చలో రాజ్‌భవన్‌'లో ఉద్రిక్తత.. రేవంత్​రెడ్డి అరెస్ట్​

Last Updated : Jul 16, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details