రాష్ట్రంలో శుక్రవారం నుంచి సీరమ్ సర్వే ప్రారంభమైంది. ఐసీఎంఆర్ ఎంపిక చేసిన మూడు జిల్లాల్లో ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ఈ సర్వేని చేపట్టారు. ఒక్కోజిల్లా నుంచి 400 నమూనాల చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 1200 మంది నుంచి సేకరించాల్సి ఉంది. ఇక నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే ప్రారంభం కాగా మొత్తం 15 బృందాలుగా ఏర్పడిన ఎన్ ఐఎన్ సభ్యులు... స్థానికంగా ఉన్న ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యాధికారుల సహకారంతో ప్రజల నుంచి రక్తాన్ని సేకరించారు.
18 ఏళ్లపైబడిన వారి నుంచి సేకరణ..
గత కొద్ది రోజులుగా స్థానిక అధికారులతో సర్వే కి సంబంధించిన మూడు జిల్లాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తుండటం వల్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. ఆశించిన దానికంటే ఎక్కువమందే సర్వే కోసం రక్త నమూనాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. ఫలితంగా నాలుగు రోజుల్లో 1200శాంపిళ్లు సేకరించాలని ఎన్ఐఎన్ భావించినా.. తొలిరోజే అందులో దాదాపు సగం నమూనాలను సేకరించగలిగనట్టు ఎన్ఐఎన్ అధికారులు చెబుతున్నారు.