Two States Partition Issues: విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ మరోమారు సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించింది. ఈనెల 23న సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.
విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం.. ఎప్పుడంటే..?
Two States Partition Issues: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించి.. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది.
సెప్టెంబర్ 27 జరిగిన భేటీలో 7 ఉమ్మడి అంశాలపై చర్చించిన కేంద్రం.. ఏపీకి సంబంధించిన 7 అంశాలపైనా చర్చించింది. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్లు చెప్పిన కేంద్రం.. మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్న ఏపీ అధికారులకు షాక్ ఇచ్చింది. రాజధానికి నిధులు ఇవ్వొద్దని సీఎం స్వయంగా లేఖ రాసారని పేర్కొంది. విభజన అంశాలపై చర్చించే అంశాల్లో తొలిసారి అమరావతిని చేర్చింది. ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమచారం. గత సెప్టెంబర్ 27న ఏలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన భేటీ..
ఇవీ చదవండి: