Amith shah at New Cyber Lab: భవిష్యత్తులో సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని సెంట్రల్ సైబర్ ఫొరెన్సిక్ లాబోరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) ఆవరణలో నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ-ఎవిడెన్షియల్ పర్పస్(ఎన్సీఎఫ్ఎల్-ఈ)ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సైబర్ నేరాల రూపంలో పెనుముప్పు ఎదురవుతోందన్నారు. వీటి నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో మోదీ ప్రభుత్వం ముందుందన్నారు. దేశవ్యాప్తంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సైబర్ ల్యాబ్ వ్యవస్థను రూపొందించడంలో నిమగ్నమైందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఎన్సీఎఫ్ఎల్ఈని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరస్థులకు శిక్షలు వేయించడంలో ఈ ప్రయోగశాల దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల్లో శిక్షల శాతాన్ని పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.
సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచి:సీఎఫ్ఎస్ఎల్ దేశంలోని అన్ని సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. 2000లో ఏర్పాటైన ఈ ప్రయోగశాల దేశంలోని పలు చట్ట అమలు సంస్థలకు నాణ్యమైన సేవలందిస్తోంది. సైబర్ ఫొరెన్సిక్స్ కోసం కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2016లో ఈ సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79ఏ ప్రకారం ‘ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’గా గుర్తింపు పొందిన తొలి సంస్థగా ఆవిర్భవించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ(సీఐఎస్) విభాగం పరిధిలో మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నియంత్రణ పథకం కింద నేషనల్ సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ(ఈ) ప్రాజెక్టును చేపట్టింది. అయిదేళ్లపాటు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.35.51 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టునే అమిత్‌షా తాజాగా ప్రారంభించారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు, లక్ష్యాలు..