తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు.. ప్రత్యేక హోదా అంశం తొలగింపు - ts news

ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు
ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో మార్పు

By

Published : Feb 12, 2022, 6:46 PM IST

Updated : Feb 12, 2022, 7:37 PM IST

18:45 February 12

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్ర హోంశాఖ

అజెండాలో కీలక మార్పు

ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ మరో సర్య్కూలర్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే.

ap special status issue: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఈనెల 17న జరిగే సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని ఉంచి.. ఈ ఉదయం ఇరు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. దాన్ని వెనక్కు తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఈ ఉదయం జారీ చేసిన అజెండాలో.. మార్పులు చేసింది. కొత్తగా మరో అజెండాతో సర్కులర్‌ జారీ చేసింది. తాజా సర్కులర్‌లో.. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. కేవలం 5 అంశాలతో మాత్రమే అజెండా తయారు చేసింది.

తాజా అజెండాలోని అంశాలు..

  1. ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన అంశం
  2. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు
  3. పన్నుల విషయంలో లోటుపాట్లు
  4. నగదు నిల్వ, బ్యాంకు డిపాజిట్లు
  5. రెండు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల్లో నగదు క్రెడిట్‌ జమ

కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

హోదా అంశంపై జీవీఎల్ స్పష్టత..
విభజన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న జరిగే సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ ప్రస్తావించడంపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌లో స్పందించారు. కేంద్రం కొత్తగా సర్కులర్ జారీ చేయటానికి ముందు ట్విట్టర్ వేదికగా జీవీఎల్.. ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. వైకాపా ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించానన్న జీవీఎల్‌.. కేంద్ర హోంశాఖ నోట్‌పై ఆరా తీశానని చెప్పారు.

ప్రత్యేక హోదా అంశం రెండు రాష్ట్రాల కమిటీ ఎజెండాలో ఉండేది కాదని తెలిసిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అన్న జీవీఎల్‌.. ఈ విషయం ఆలోచిస్తే అర్ధమవుతుందని ట్వీట్‌ చేశారు. కేంద్ర హోంశాఖ నోట్‌ను తాను చూశానని, అధికారులతో మాట్లాడానని, ఆ తరువాతే వివరణ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.

‘‘ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు. ఇది కేవలం అంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం మాత్రమే. రెవెన్యూ లోటు కూడా ఏపీకి మాత్రమే సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని వాకబు చేస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. కానీ, ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవపట్టించే విధంగా ఉంది. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’’ అని జీవీఎల్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 12, 2022, 7:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details