Review On Bifurcation: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.
Review On Bifurcation: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం - Review On Bifurcation by central home affairs
Review On Bifurcation: ఏపీ, తెలంగాణల మధ్య విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల మధ్య విభజనాంశాలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై సమీక్షలో చర్చించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చ జరిగింది. సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్, దిల్లీలో ఏపీ భవన్ విభజనపై అధికారులు చర్చించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, విద్యుత్ బకాయిలు, పన్ను చెల్లింపులు, రిఫండ్ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారు. బ్యాంకు ఖాతాల్లో నగదు పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా చర్చ జరిగింది. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలపై చర్చకు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి:"ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతా"