Central Govt Petition on Singareni Elections :సింగరేణి ఎన్నికల ప్రక్రియ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా కేంద్ర కార్మికశాఖ.. సింగరేణి ఎన్నికలకు(SCCL) సహకరించేలా సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 28న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర కార్మిక శాఖ షెడ్యూలు విడుదల చేసింది.
SCCL Thirty Two Percent Share to Workers : సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.700 కోట్ల బోనస్
షెడ్యూలు ప్రకారం గత నెల 30న ఓటరు జాబితా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి.. ఈ నెల 5న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే సింగరేణి కాలరీస్ యాజమాన్యం సహకరించడం లేదని పిటిషన్ లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గత నెల 27న సమావేశం పెడితే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదని.. ఇప్పటి వరకు ఓటరు జాబితా వెల్లడించలేదన్నారు.
Singareni Collieries Company :సింగరేణి యాజమాన్యం సహకరించక పోవడం వల్ల.. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముందుకెళ్లలేక పోతున్నామని పిటిషన్ లో కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. కాబట్టి ఎన్నికలకు సహకరించాలని సింగరేణి కాలరీస్తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును కోరింది.
సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని.. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేయాలంటూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికే డివిజన్ బెంచిని ఆశ్రయించింది. దీంతో సింగరేణిలోగుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనా.. ఎలక్షన్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.