Pending Issues Related to the State: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ నెల 16వ తేదీన కేంద్రప్రభుత్వం సమీక్షించనుంది. కేంద్ర, రాష్ట్ర సమన్వయానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు. ఈ సమీక్ష పోర్టల్లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సమీక్ష నిర్వహించనుంది. దిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షిస్తారు.
రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ - Kaleshwaram project
Pending Issues Related to the State: రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న అంశాలపై కేంద్రప్రభుత్వం సమీక్షను నిర్వహించనుంది. దీనిని దిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో దృశ్యోమాధ్యమం ద్వారా సమీక్షిస్తారు. ఇందులో పోర్టల్లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు పొందుపరిచిన అంశాలు ఉన్నాయి.
![రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ Pending Issues Related to the State](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16885527-460-16885527-1668054852631.jpg)
Pending Issues Related to the State
పోర్టల్లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన 24 అంశాలు ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు పొందుపరిచిన మరో 13 అంశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న బీఆర్జీఎఫ్ నిధులు, ఎన్డీఆర్ఎఫ్ నిధులపై చర్చ జరగనుంది. ఐటీఐఆర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు, కొత్త విమానాశ్రయాలు, ఐఐఎం ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షలో చర్చిస్తారు.
ఇవీ చదవండి: