తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంబయితో అనుసంధానిస్తూ భాగ్యనగరానికి బుల్లెట్‌ రైలు!

భాగ్యనగర కీర్తి శిఖలో త్వరలో మరో కలికితురాయి చేరే అవకాశం ఉంది! దేశ ఆర్థిక రాజధాని ముంబయిని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టవచ్చు! ఈ మేరకు సమగ్ర నివేదిక సిద్దం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)ను కేంద్రం ఆదేశించింది.

central government thinks of joining Mumbai and Hyderabad with bullet train
ముంబయితో అనుసంధానిస్తూ భాగ్యనగరానికి బుల్లెట్‌ రైలు!

By

Published : Sep 15, 2020, 6:17 AM IST

Updated : Sep 15, 2020, 6:36 AM IST

త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ముంబయి-హైదరాబాద్‌ మార్గం కూడా ఒకటి. ‘‘ఏడు కొత్త నడవాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లని ఓ అధికారి వెల్లడించారు.

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య (508.17 కిలోమీటర్లు) కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబరులో బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే- భూ సేకరణ సంబంధిత సమస్యలు, కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబరుకు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 63 శాతం భూ సేకరణ పూర్తయింది.

ఇదీ చూడండి:వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

Last Updated : Sep 15, 2020, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details