Paddy Procurement: వరిధాన్యం సేకరణపై కేంద్రం ప్రకటన విడుదల చేసింది. 2020-21లో 4.44 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించింది. అత్యధికంగా పంజాబ్ నుంచి 1.87 కోట్ల టన్నులు సేకరించామని పేర్కొంది. పంజాబ్‌లో ధాన్యం సేకరణ ద్వారా 47.03 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రకటించింది. ధాన్యం సేకరణలో పంజాబ్ ప్రథమ స్థానంలో నిలవగా... హరియాణా రెండో స్థానంలో నిలిచింది.
తెలంగాణ నుంచి 52.88 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 7.84 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొంది. ఏపీ నుంచి 7.67 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని.. తద్వారా ఏపీలో 98,972 మంది రైతులకు లబ్ధి జరిగిందని కేంద్రం ప్రకటించింది.