తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ భేష్: కేంద్రం - telangana corona vaccination news

కరోనా మహమ్మారి నివారణలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్​లో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే సమర్థంగా ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖను అభినందించింది.

వాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ భేష్: కేంద్రం
వాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ భేష్: కేంద్రం

By

Published : Jan 20, 2021, 5:20 AM IST

Updated : Jan 20, 2021, 6:11 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర వైద్యారోగ్య శాఖను అభినందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి... డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్​రెడ్డిలతో పాటు వైద్యారోగ్య శాఖ యంత్రాంగాన్ని, కలెక్టర్​లను అభినందించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు కేంద్రం అభిప్రాయపడినట్టు ఆయన వివరించారు.

Last Updated : Jan 20, 2021, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details