AP capital issue in central budget meeting: విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 'రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా' అని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపింది.
ఏపీ రాజధానిగా అమరావతే.. కేంద్రం స్పష్టత - ap capital issue discussion
AP capital issue in central budget meeting: రాజ్యసభలోని జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కేంద్రం స్ఫష్టతను ఇచ్చింది. రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చింది. ఇంతకి కేంద్రం జవాబు ఏమి ఇచ్చిందంటే..
![ఏపీ రాజధానిగా అమరావతే.. కేంద్రం స్పష్టత AP capital issue in central budget meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17699748-165-17699748-1675848759320.jpg)
ఏపీ రాజధానిగా అమరావతే
ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడటం సబ్‌జ్యుడిస్ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది. 2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని తెలిపింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ సుప్రీంలో పిటిషన్ వేయగా, ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: