తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు తరలింపుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు - ఏపీ హైకోర్టు తరలింపు పై కేంద్రం వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం
హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం

By

Published : Feb 4, 2021, 2:05 PM IST

ఏపీ‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు... కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు తరలింపునకు ఏపీ సీఎం జగన్‌ ప్రతిపాదనలు పంపారని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని పేర్కొన్నారు. తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు.. విద్యార్థులకు పోటీలు'

ABOUT THE AUTHOR

...view details