Central Government Clarity On Polavaram Issue : పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వమే చేపడుతున్నందున నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
'పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు' - polavaram residents
Central Clarity On Polavaram : పోలవరం నిర్మాణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వమే చేపడుతున్నందున.. నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని షెకావత్ పేర్కొన్నారు. భూసేకరణ, పునరావాసంపై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆయన తెలిపారు. ‘‘భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు రూ.3,779.05 కోట్ల బిల్లులును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిందని తెలిపారు. వాటిలో రూ.3,431.59కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఏపీ ప్రభుత్వం రూ.2,267.29 కోట్ల బిల్లులు సమర్పించగా.. ఇప్పటి వరకు రూ.2,110.23కోట్లు తిరిగి చెల్లించాం అని షెకావత్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: