Central govt about TS paddy procurement: తెలంగాణలో ధాన్యం కొంటాం: కేంద్రం - తెలంగాణ వార్తలు
![Central govt about TS paddy procurement: తెలంగాణలో ధాన్యం కొంటాం: కేంద్రం Central govt about TS paddy procurement, paddy procurement news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13749083-936-13749083-1637990446871.jpg)
10:44 November 27
తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ: కేంద్రం
Paddy procurement in Telangana: తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు ఆందోళనలు చేపడుతున్న వేళ కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వేర్వేరు వాదనలు రైతులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి. పండిన పంటనంతా పూర్తిగా కొంటామని ఒకరు... లక్ష్యానికి మించి కొనేదిలేదని మరొకరు రైతులకు చెప్పారు. ఈ ప్రకటనలకు అనుగుణంగానే భాజపా, తెరాస పార్టీలు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. అయితే.. క్షేత్ర స్థాయిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిన పరిస్థితుల్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ధాన్యం కొంటామని ప్రకటించింది.
ఇదీ చదవండి:Paddy Procurement in Telangana: కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం.. కొనేదెప్పుడు?