తెరాస కార్యాలయం నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయింపు - తెలంగాణ వార్తలు
![తెరాస కార్యాలయం నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయింపు దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9115838-thumbnail-3x2-land-rk.jpg)
19:37 October 09
దిల్లీలో తెరాస కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు
తెరాస పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. దిల్లీ వసంత్ విహార్లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ అధికారి దీన్ దయాళ్... ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
ఎకరానికి రూ. 25 కోట్ల చొప్పున స్థలానికి ఖరీదు చెల్లించి ఏడాదికి రెండున్నర శాతం అద్దె... రెండు విడతలుగా జనవరి, జులైలో చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ ధర పెరిగితే మిగతా సొమ్ము చెల్లించాలని.. రూ. 10 స్టాంపు పేపరుపై హామీ ఇవ్వాలని తెలిపింది. స్థలం కేటాయింపు పూర్తయినందున త్వరలో శంకుస్థాపన చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.