తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పోలీస్ అధికారుల తుది కేటాయింపు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం అధికారుల కేటాయింపులు జరిగాయి. ఇందులో నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. గతంలో జరిగిన కేటాయింపుల విషయంలో కొంతమంది పోలీస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఆ మేరకు 52:48 శాతం ప్రకారం కేటాయింపులు నిర్ణయించింది. కేంద్ర కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నాన్ కేడర్ ఎస్పీలు-16మంది, అదనపు ఎస్పీలు 64 మంది, డీఎస్పీలు 302 మందిని కేటాయించారు. తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీలు 9 మంది, అదనపు ఎస్పీలు 49 మంది, డీఎస్పీలు 192 మందిని ఇచ్చారు.