తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగునీటి రంగానికి అంతంత మాత్రమే కేటాయింపులు

రాష్ట్ర సాగునీటి రంగానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి వెయ్యి కోట్లు అదనం తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం లేదు. జాతీయ ప్రాజెక్ట్, కాళేశ్వరం నిర్వహణకు నిధులు కోరినా ఫలితం లేదు. నదుల అనుసంధానికి కూడా నిధులు కేటాయించలేదు.

central goverment less funds to the state irrigation
సాగునీటి రంగానికి అంతంత మాత్రమే కేటాయింపులు

By

Published : Feb 2, 2020, 8:12 AM IST

Updated : Feb 2, 2020, 1:04 PM IST

సాగునీటి రంగానికి అంతంత మాత్రమే కేటాయింపులు
ఎత్తిపోతల పథకాలపై ఆధారపడ్డ రాష్ట్రానికి సాగునీటి రంగంలో తగిన ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతున్నా.. మొండి చెయ్యే మిగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి తగిన నిధులు ఇవ్వాలని పలు దఫాలుగా విజ్ఞప్తి చేసింది. కానీ తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావన ఏ మాత్రం కనిపించలేదు.

గతంతో పోలిస్తే రూ.1,012 కోట్లు ఎక్కువ

ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా.. సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి కేంద్ర బడ్జెట్లో రూ.5,126 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్​తో పోలిస్తే కేవలం రూ.1,012 కోట్లు మాత్రమే ఎక్కువ. ఈ కేటాయింపుల్లోనూ రూ.2,675 కోట్లు రుణాలకు వడ్డీ చెల్లించేందుకు వెళ్లనున్నాయి. మిగిలిన మొత్తాన్ని నాబార్డు వివిధ ఎత్తిపోతల పథకాలకు ఖర్చు చేయనుంది.

నదుల అనుసంధానానికి కేటాయింపు లేవి?

సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి ఏ మేరకు నిధులు అందుతాయన్నది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపడతామని కేంద్రం గతంలో ప్రకటించింది. కానీ బడ్జెట్లో నిధుల కేటాయింపు మాత్రం చేయలేదు.

కృష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున... గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్​కు తీసుకెళ్లాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సన్నద్ధం అవుతున్నాయి. నదుల అనుసంధానం కేంద్రం చేపడితే ఆ నిధులు ఉపయోగించుకోవచ్చని భావించారు. కానీ నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు కేటాయించలేదు.

ఇవీ చూడండి:ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!

Last Updated : Feb 2, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details