ఆదాయపు పన్ను శాఖ ద్వారా 2019- 20 ఆర్థిక ఏడాదిలో రూ. 13.35 లక్షల కోట్ల వసూళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దేశంలో నెలకొన్న వివిధ ప్రతికూల అంశాల కారణంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రత్యక్ష పన్నులు వసూళ్లు అయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2018- 19 ఆర్థిక ఏడాదిలో రూ. 11.37 లక్షల కోట్ల రాబడి ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు - సీబీడీటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కార్పొరేట్ పన్నుల కింద రూ. 6.63లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా రూ.4.73లక్షల కోట్లు, ఇతరత్ర రూ. వెయ్యి కోట్ల లెక్కన వచ్చినట్లు ప్రకటించింది.
రూ. లక్షకోట్లైనా...
ప్రస్తుత పరిస్థితుల్లో 2019- 20 ఆర్థిక ఏడాది లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏ మాత్రం లేదు. రెండు లక్షల కోట్లకుపైగా మొత్తాన్ని నిర్దేశించిన లక్ష్యంతో సవరించే అవకాశం ఉందని ఐటీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో పన్ను వసూళ్లను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా చాలాకాలంగా పరిష్కారం కాని పెండింగ్ కేసులను రాయితీలు ఇవ్వడం ద్వారా పరిష్కరించి పన్నుల వసూళ్లను పెంచుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. 'వివాద్ సే విశ్వాస్- 2020' పథకం ద్వారా దేశవ్యాప్తంగా కనీసం రూ. లక్ష కోట్లైనా.. వసూళ్లు అవుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది.
ఫైళ్ల బూజు దులిపే పనిలో..