తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి కొత్తగా 7 ఏకలవ్య గురుకుల పాఠశాలలు - ఏకలవ్య గురుకుల పాఠశాలలు

తెలంగాణకు కొత్తగా ఏడు ఏకలవ్య గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు మంజూరు చేసింది.

central gave 7 new ekalavya schools to telangang
రాష్ట్రానికి కొత్తగా 7 ఏకలవ్య గురుకుల పాఠశాలలు

By

Published : Jul 15, 2020, 6:48 PM IST

రాష్ట్రానికి మరో ఏడు ఏకలవ్య గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 16 ఏకలవ్య గురుకులాలు ఉండగా... వీటితో కలిపి ఆ సంఖ్య 23కు చేరుకోనుంది. కొత్త పాఠశాలలతో మరో 840 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. ఒక్కో విద్యార్థిపై లక్షా తొమ్మిది వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

రాష్ట్రానికి కొత్తగా 7 ఏకలవ్య గురుకుల పాఠశాలలు
రాష్ట్రానికి కొత్తగా 7 ఏకలవ్య గురుకుల పాఠశాలలు

పాఠశాలల నిర్మాణానికి 231 కోట్ల రూపాయలు ఖర్చు

ఇప్పటికే ఉన్న 16 ఏకలవ్య గురుకులాల్లో 5,250 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, దుమ్ముగూడెం, ముల్కనపల్లి, ఖమ్మం జిల్లా సింగరేణికి కొత్త ఏకలవ్య పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు 33 కోట్ల చొప్పున ఏడు పాఠశాలల నిర్మాణానికి 231 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

కొత్త ఏకలవ్య గురుకులాల మంజూరు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

ఇదీ చూడండి :గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

ABOUT THE AUTHOR

...view details