తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటైన్‌మెంట్​ జోన్ల నిర్వాహణ బాగుంది' - రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్​ జోన్ల నిర్వాహణ బాగుందని కితాబిచ్చారు కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ ఉప సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్.

Central family welfare director visit old city
'కంటైన్‌మెంట్​ జోన్ల నిర్వాహణ బాగుంది'

By

Published : Apr 22, 2020, 7:13 PM IST

కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ ఉప సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ జోన్లలో పర్యటించారు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్​ జోన్ల నిర్వాహణ బాగుందని ఆయన కితాబిచ్చారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని మూడు కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లలో డాక్టర్ రవీందర్, ఇతర అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు.

కంటైన్‌మెంట్‌లో రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే, శానిటైజేషన్‌, క్రిమిసంహారక ద్రావణాల పిచికారీ గురించి వాకబు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వైలెన్స్‌ టీమ్‌కు వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు. ఎమర్జెన్సీ అధికారుల బృందం 24 గంటలపాటు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details