Central Election Commission on Assembly Elections :ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు, వివిధ కానుకల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక నిర్ణయం తీసుకొంది. స్వాధీనం చేసుకుంటున్న నగదు, కానుకలు, వస్తువుల ధరను లెక్కగట్టి నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను ఆదేశించింది. ఇదే సమయంలో తగిన సాక్ష్యాలు ఉంటే పట్టుబడుతున్న నగదును వదిలిపెట్టాలని(EC Seized Money) సూచించింది.
ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్ కుమార్ వ్యాస్, ముఖ్యకార్యదర్శి అవినాశ్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. సీఈఓతో పాటు ఇతర అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్, నోడల్ అధికారులతో సమావేశమై ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు.
Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..
Telangana Assembly Election 2023 :అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపు అడ్డుకునేందుకు సాంప్రదాయ పద్దతులు కాకుండా ఆధునికంగా ఆలోచించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించారు. ఓటర్ల జాబితా తుది సవరణల తరువాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల విషయంలో తాజా పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ ధృవపత్రాలను రోజువారీగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.