తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా - కరోనా కట్టడిపై కేంద్ర కేబినేట్ సెక్రటరీ గౌబ సమావేశం

కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రాల పనితీరుపై కేంద్ర కేబినెట్​ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల సీఎస్​లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర సమష్టి కృషి ఫలితంగా కరోనాను కట్టడి చేయగలగుతున్నామన్నారు. కరోనా కేసుల విషయంలో ఆందోళన వద్దని, కేసుల సంఖ్యను దాచొద్దని గౌబా సూచించారు.

central-cabinet-secretory-video-conference-to-cs
ఎక్కువ కేసులు నమోదైన ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా

By

Published : Apr 26, 2020, 7:23 PM IST

కరోనా కేసుల సంఖ్యను దాచే ప్రయత్నం చేయోద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఎక్కువ మందికి టెస్టులు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని...కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని సూచించారు. రెడ్​జోన్, కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం నుంచి సీఎస్ సోమేశ్​కుమార్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

లాక్​డౌన్ కఠినతరం చేయండి

కరోనా నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలు వినియోగించుకోవాలని గౌబా కోరారు. లాక్​డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలుచేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్​డౌన్ నిబంధనల మరింత కఠినతరం చేయాలన్నారు. రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఆయా మతపెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడాలన్నారు. రేషన్ దుకాణాలు, నిత్యావసర సరకులు తీసుకునే చోట, రైతు బజార్లు,ఏటీఎమ్​లు, బ్యాంకులలో భౌతికదూరాన్ని పాటించేలా ప్రజలందరిలో అవగాహన కల్పించాలని సీఎస్​లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు.

ఇదీ చదవండి :ఏప్రిల్ జీతాలపై ప్రభుత్వం క్లారిటీ!

ABOUT THE AUTHOR

...view details