తెలంగాణ

telangana

ETV Bharat / state

Central Cabinet Approves Two Multi Tracking Railway Projects In Telangana : ఆ రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్​సిగ్నల్.. వ్యయం రూ.9వేల కోట్లు

Union Cabinet Approves Two Multi Tracking Projects In Telangana : రాష్ట్రంలోని రెండు కీలక రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. గుంటూరు-బీబీనగర్ సింగిల్​ డబ్లింగ్​​; ముద్కేఢ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబుల్​ డబ్లింగ్​ వంటి రెండు కీలక మార్గాల్లో సుమారు రూ. 9వేల కోట్లతో పనులు జరగనున్నాయి.

Two Multi Tracking Projects In Telangana
Central Cabinet Approves Three Multi Tracking Railway Projects In Telangana

By

Published : Aug 16, 2023, 7:39 PM IST

Cabinet Clear Two Telangana Multi Tracking Railway Projects : రాష్ట్రంలోని కీలక రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. గుంటూరు-బీబీనగర్ సింగిల్​ డబ్లింగ్​​, ముద్కేఢ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబుల్​ డబ్లింగ్​ వంటి రెండు కీలక రైల్వే డబ్లింగ్​ ప్రాజెక్టు(Railway Multi Tracking Projects)లకు కేంద్ర కేబినెట్​​ ఆమోదముద్ర వేసింది. వీటిని సుమారు రూ.9వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఏప్రిల్​ నెలలో ప్రధాని హైదరాబాద్​ పర్యటనకు విచ్చేసినప్పుడు.. రూ.1,410 కోట్లతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్​ రైల్వే లైన్​ను జాతికి అంకితం ఇచ్చారు.

గుంటూరు-బీబీనగర్​ మార్గంలో 239 కిలోమీటర్ల డబ్లింగ్​ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్​(Central Cabinet)​ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టును రూ.3,238 కోట్లతో 239 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. హైదరాబాద్​-చెన్నై మధ్య 76 కిలోమీటర్ల దూరం తగ్గనుందని రైల్వే శాఖ(Railway Ministry) తెలిపింది. అలాగే హైదరాబాద్​-విజయవాడ మధ్య కూడా దూరం తగ్గనుంది. ఈ మార్గం అభివృద్ధి చేయడం ద్వారా నగరాల మధ్య రైళ్ల వేగం కూడా పెరగనుంది. సిమెంట్​ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో.. సరుకు వేగం కూడా పెరిగేందుకు ఆస్కారం ఉందని రైల్వే శాఖ అభిప్రాయ పడుతోంది.

ముద్కేఢ్​-మేడ్చల్​, మహబూబ్​నగర్​-డోన్ మధ్య డబ్లింగ్​ పనులకు ఆమోదం : ఇంకోవైపు ముద్కేఢ్​-మేడ్చల్​, మహబూబ్​నగర్​-డోన్ మధ్య రూ.5618 కోట్ల విలువ చేసే డబుల్​ డబ్లింగ్​ పనులకు కూడా కేంద్ర కేబినెట్​ పచ్చజెండా ఊపింది. ఈ మార్గాల అభివృద్ధితో హైదరాబాద్​-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గనుందని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ కొత్త మార్గం పూర్తయితే వందే భారత్​ వంటి రైళ్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే జీఎం హర్షం : కేంద్ర కేబినెట్​ రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడం పట్ల దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్రాంతాల ప్రజలకు ఈ రెండు ప్రాజెక్టులతో ఎంతో ఉపయోగం ఉందని వివరించారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముద్కేఢ్​-డోన్ మధ్య ఉన్న 417.88 కిలోమీటర్ల డబ్లింగ్​ పనులకు రూ.4,686.09 కోట్లను అంచనా వ్యయంగా కేటాయించారని వెల్లడించారు. రామగుండం, ముద్దనూరు, బెల్లారి థర్మల్​ ప్లాంట్స్​ వయా పెద్దపల్లికి బొగ్గు సరఫరా చేసేందుకు వీలవుతోందని ప్రకటించారు. ​

Modi Visit To Hyderabad In April 2023 : ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్​ నెలలో హైదరాబాద్​ పర్యటనలో రూ.11,355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే సికింద్రాబాద్​ నుంచి తిరుపతికి రెండో వందే భారత్​ రైలును ప్రారంభించారు. రూ.715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్​-మహబూబ్​నగర్​ మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్​ రైల్వే లైన్​ను జాతికి అంకితం ఇచ్చారు. ఎంఎంటీఎస్​ రెండో దశలో 13 కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details