రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు, కాంటాక్టుల గుర్తింపు, ఐసోలేషన్, క్వారంటైన్ వసతులు పెంచామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల ఉన్నతాధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ... ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను సమీక్షించారు.
కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం : సీఎస్ సోమేశ్ కుమార్ - కేంద్ర కేబినేట్ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు, కాంటాక్టుల గుర్తింపు, ఐసోలేషన్, క్వారంటైన్ వసతులు పెంచామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. పకడ్బందీగా కంటైన్మెంట్ చర్యల అమలు, చికిత్స నిర్వహణ, అవగాహన చర్యలు చేపట్టాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు.
కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం: సీఎస్ సోమేశ్ కుమార్
కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పెంచాలని, పకడ్బందీగా కంటైన్మెంట్ చర్యల అమలు, చికిత్స నిర్వహణ, అవగాహన చర్యలు చేపట్టాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించారు. సమీక్షలో పాల్గొన్న సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. పరీక్షలు పెంచామని, సదుపాయాలు, సిబ్బందిని కూడా పెంచామని సీఎస్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు