తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ను రద్దు చేసేందుకు క్యాట్ నిరాకరణ - central tribunal decision on ab venkateswararao issue

సీనియర్​ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ను రద్దు చేసేందుకు క్యాట్​ నిరాకరించింది. తనను ఏపీ సర్కారు విధుల నుంచి తప్పించడంపై ఆయన వేసిన పిటిషన్​ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ కొట్టేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించారని ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. ఈ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్​ను ఆశ్రయించారు.

central-adminstrative-tribunal-dismissed-ips-officer-ab-venkateswararao-petition
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ను రద్దు చేసేందుకు క్యాట్ నిరాకరణ

By

Published : Mar 17, 2020, 2:02 PM IST

తన సస్పెన్షన్‌ను సవాల్​ చేస్తూ సీనియర్​ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ కొట్టేసింది. ఆయన సస్పెన్షన్​ రద్దు చేసేందుకు నిరాకరించింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో సర్వీసు నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగంపై ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ ఆయన క్యాట్​ను ఆశ్రయించారు. తనను అన్యాయంగా విధుల నుంచి తప్పించారని ఆరోపించారు.

నిబంధనలను అనుసరించే ఆయన్ను సస్పెండ్​ చేశామని.. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదించిందని ఏపీ సర్కారు వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌లతో కూడిన ధర్మాసనం... ఏబీ పిటిషన్‌ కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details