విజయ తెలంగాణ బ్రాండ్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో ఏపీ లోగోతో విజయ బ్రాండ్ పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
విజయ బ్రాండ్ లోగోకు కేంద్రం ఆమోదం - Vijaya brand logo central accepted
తెలంగాణ విజయ బ్రాండ్ లోగోకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఇక నుంచి టీఎడీడీసీఎఫ్ పేరిట పాలు, పాల ఉత్పత్తులు తెలంగాణ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయించునున్నామని ఆ సహకార సంస్థ ఛైర్మన్ పేర్కొన్నారు.
![విజయ బ్రాండ్ లోగోకు కేంద్రం ఆమోదం Center nod for Vijaya brand logo in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5443353-948-5443353-1576876482927.jpg)
వీటిని అధిగమించేందుకు తెలంగాణా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ, విజయ తెలంగాణా లోగోతో భారత ప్రభుత్వ సంస్థ ట్రేడ్‌మార్క్ అథారిటీని సంప్రదించింది. దీనిని పరిశీలించిన తర్వాత ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ విజయ తెలంగాణ బ్రాండ్‌ను రిజిస్టర్ చేసి ధృవ పత్రం జారీ చేసింది. ఇక నుంచి టీఎడీడీసీఎఫ్ పేరిట పాలు, పాల ఉత్పత్తులు తెలంగాణ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయిస్తామని తెంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ తెలిపారు.
ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్